బ్రేకింగ్ : లోటస్ పాండ్ లో డెడ్ బాడీ.. ఆత్మహత్యా ? హత్యా ?

లోటస్ పాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతానికి బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది హత్య ? లేక ఆత్మహత్య ? అనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాకింగ్ కోసం వచ్చిన వ్యక్తి అని అనుమానిస్తున్నారు పోలీసులు.

చనిపోయిన వ్యక్తి టీషర్ట్, ట్రాక్ పాయింట్ వేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇప్పుడు ఆ మృతుడి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా మంది లోటస్ పాండ్ అంటే జగన్ నివాసం అనుకుంటారు. కానీ అది జగన్ ఇంటికి పక్కనే ఉండే ఒక చెరువు. దాని పేరే లోటస్ పాండ్.