ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏడవ వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వానికి డీఏ లో మూడు శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో బేసిక్ పే లో 34% డి ఎ అవుతుంది. ఈ చర్య కారణంగా 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
అటు కేంద్ర ప్రభుత్వంపై 9,544.50 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డి ఎ అలవెన్స్, డిఆర్ గణన, లేబర్ బ్యూరో అలాగే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆలిండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం కార్మిక, ఉపాధి రేటు ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు మోడి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు ఉద్యోగులు.