హిజాబ్ వివాదంపై మిస్ యూనివర్స్ కీలక వ్యాఖ్యలు

-

హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కొన్ని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించి విద్యార్థులు తరగతులకు హాజరవ్వడాన్ని మరో వర్గం విద్యార్థుల వ్యతిరేఖించి… కాషాయ కండువాలతో రావడం ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. దీనిపై ఇటీవల కర్ణాటక హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. హిజాబ్ ముస్లిం మతంలో తప్పనిసరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ తీర్పును సుప్రీం కోర్ట్ లో ఛాలెంజ్ చేశారు. ఇదిలా ఉంటే హిజాబ్ వివాదంపై మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంధు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక అమ్మాయి హిజాబ్ ధరించడం అది ఆమె ఇష్టం అని.. ఎవరైనా ఆమెపై ఆధిప్యతం చెలాయించినా.. ఆమె గట్టిగా తన గళాన్ని వినిపించాలని అంది. ఆమె ఎలా జీవించాలనుకుంటుందో అలా జీవించనివ్వండి అని… విభిన్న సంస్కృతులకు చెందిన మహిళలు ఒకరినొకరు గౌరవించుకోవాలని హర్నాజ్ కౌర్ సంధు అన్నారు. గతంలో కూడా ఈ మిస్ యూనివర్స్ హిజాబ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news