డిసెంబర్‌ 03 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

డిసెంబర్‌-03–కార్తీకమాసం- గురువారం.

మేషరాశి: ఈరాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి చదవితే ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషభరితంగా ఉంటుంది.

పరిహారాలుః శుక్రగ్రహారాధన చెప్పుకోతగ్గ సూచన.

todays horoscope

వృషభరాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు అనుకోని శుభవార్త అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దేవాలయ సందర్శనకు అవకాశం ఉంది. వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది. చేసే పనులలో అదృష్టం బాగా కలసి వస్తుంది.

పరిహారాలుః శ్రీగురుచరిత్ర పారాయణం చేయండి మంచిఫలితం వస్తుంది.

మిథునరాశి: ఈరోజు నిగ్రహాన్ని కోల్పోకండి !

ఈరోజు గ్రహచలనాల రీత్యా ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. నిగ్రహంతో పనిచేయాలి. క్రమశిక్షణతో పని చేయడం వల్ల లాభం పొందుతారు. ఆఫీస్‌లో మీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

పరిహారాలుః బాబా దేవాలయం దునిలో కొబ్బరికాయను సమర్పించండి.

కర్కాటకరాశి: ఈరోజు విజయాన్ని అందుకుంటారు !

ఈరోజు మీకు అనుకూల వాతావరణం. కొద్దిగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకుంటారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు. వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఈరోజు బాగా ఉన్నాయి. ఈరోజు ఆర్థిక విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శివాలయంలో ప్రదక్షణలు చేయండి. దీపారాధన చేయండి.

 

సింహరాశి: ఈరోజు వేడుకలకు హజరయ్యే అవకాశం !

ఈరోజు వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. ఈ రోజు మీరు చేస్తున్న పని ఆగిపోతుంది. ఈరోజు ఆనందంగా గడుపుతారు. కొంత మంది వేడుకలకు హాజరయ్యే అవకాశముంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వైవాహికంగా సంతోషం ఉంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

కన్యరాశి: ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. సృజనాత్మక రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్తగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. నూతన ఉద్యోగం కోసం ఆలోచిస్తుంటే ఈ రోజు ప్రయత్నాలను ప్రారంభించండి. సాయంత్రం సమయంలో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రసాద సమర్పణ చేయండి.

తులరాశి: ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు గ్రహాల దృష్టి అనుకూలంగా ఉంది. దీనివల్ల మీరు ప్రయోజనాలు పొందుతారు. పోటీపరీక్షల్లో, విద్యా రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యాన్ని విస్మరించకండి. వైవాహిక జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

వృశ్చికరాశి: ఈరోజు ఉత్సాహంగా ఉంటారు !

ఈరోజు మీరు ఎంచుకున్న రంగంలో అనుకూల ఫలితాలు. ఈ రోజు ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభం పొందుతారు. అంతేకాకుండా వ్యాపారం చేస్తున్న వారికి పురోగతి ఉంటుంది. మీరు తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం మంచిది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః గురుగ్రహారాధన చేయండి, దీనివల్ల ఫలితాలు మరింత అనుకూలంగా వస్తాయి.

 

ధనస్సురాశి: ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం !

ఈరోజు అనుకూల ఫలితాలు లభిస్తాయి.  ఇంట్లో వస్తువుల కొనుగోలు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు విజయం సాధిస్తారు. ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురుకావచ్చు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీగురుచరిత్ర పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు లభిస్తాయి.

మకరరాశి: ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది !

ఈరాశి వారు ఈ రోజు బిజీగా ఉంటారు.  వ్యాపార రంగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మూల మలుపుల్లో. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

పరిహారాలుః శుక్రగ్రహం, గురుగ్రహారాధన చేయండి.

కుంభరాశి:ఈరోజు బాగా కలసి వస్తుంది !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. మీరు పిల్లల నుంచి ఆనందం పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి. వీలైతే నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

మీనరాశి: ఈరోజు వ్యాపారులకు అనకూలంగా ఉంటుంది !

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందం జరగవచ్చు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు ముఖ్య సమాచారం సాయంత్రం అందుతుంది. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. వైవాహిక జీవితం సాధారణంగా సాగిపోతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news