టోక్యో ఒలింపిక్స్ ఇండియా క్రీడాకారులు దుమ్ములేపుతున్నారు. తాజాగా ఆర్చర్ దీపికా కుమారి.. మహిళల సింగిల్స్ ఈవెంట్ తొలి రౌండ్ లో సునాయస విజయాన్ని నమోదు చేసుకుంది. భూటాన్ కు చెందిన కర్మాతో జరిగిన మ్యాచ్ తో వరుసగా మూడు సెట్లలో సునాయాస విజయం సాధించిన దీపికా కుమారి, రౌండ్ 16 కు అర్హత సాధించింది. దీంతో… దీపికా కుమారి సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంది.
కాగా.. అటు ఆర్చర్ ప్రవీణ్ జాదవ్, తరుణ్ దీప్ రాయ్ రౌండ్ 16 లో ఓటమి పాలైయ్యరు. మొదటి రౌండ్ లో వరల్డ్ నెం.2 గల్సన్ బజర్‌జాపోయ్ ను 6-0 తేడాతో ఓడించిన ప్రవీణ్ జాదవ్, అమెరికాకు చెందిన వరల్డ్ నెం. 1 బ్రాడీ ఎల్లిసన్ తో జరిగిన మ్యాచ్ లో 0-6 తేడాతో ఓడిపోయాడు. మొదటి మ్యాచ్ లో ఉక్రెయిన్ ప్లేయర్ హన్ బిన్ ను ఓడించిన తరుణ్ దీప్ రాయ్, ఆ తర్వాత ఇజ్రాయిల్ కు చెందిన షాన్నీ ఇట్టీతో జరిగిన మ్యాచ్ లో 6-5 తేడాతో ఓడాడు.