అమిత్ షాను కలిసిన తెలంగాణ ఎంపీ

-

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కలిశారు. ఈ సందర్భంగా భైంసా అల్లర్ల పై అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ… భైంసాలో హిందువుల మీద దాడికి పాల్పడుతున్నారని…. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా హిందువుల పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు.

భైంసా లో జరిగిన అల్లర్లలో నష్టపోయింది హిందువులేనని… మార్చిలో జరిగిన అల్లర్లలో 30 మంది హిందువుల పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారు… అందులో మైనర్లు కూడా ఉన్నారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్రహింసలకు పాల్పడుతోందని… మైనారిటీలను పోలీసులు ఏమి అనట్లేదని ధ్వజమెత్తారు. కేవలం హిందువుల పైన మాత్రమే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి హిందువుల పైన కేసులు పెడుతున్నారని… హిందువుల పైన “పిడియాక్ట్” పెట్టారని ఫైర్‌ అయ్యారు. దీనిపై సిబిసిఐడితో ఎంక్వయిరీ చేయించాలని అమిత్ షాను కోరానని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news