ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ ఆమేనా …?

-

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌కు లాక్‌డౌన్ కార‌ణంగా బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌భాస్ ఇప్ప‌టికే త‌న నెక్ట్స్ సినిమాను కూడా ప్ర‌క‌టించేశారు. మహానటితో సూప‌ర్ హిట్ కొట్టిన‌ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో డార్గింగ్ ఓ సినిమా చేయ‌నున్నాడు. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవ‌ల ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఈ శుభ‌వార్త‌ను అందించారు. వైజయంతి మూవీ అధినేత అశ్విని దత్ సినిమాను నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్ర‌భాస్ స‌ర‌స‌ హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో చిత్ర యూటిన్ ఉన్నారని ఇప్పటికే వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేపథ్యంలోనే దీపిక‌ను సంప్ర‌దించారు మేక‌ర్స్‌. వాస్త‌వానికి ప్రభాస్ స‌ర‌స‌న నటించడానికి చాలా మంది బ్యూటీలు రెడీ అవుతుంటే ఈ హాట్ బ్యూటీ మాత్రం ఎవరు ఊహించని విధంగా రెమ్యునరేషన్ దగ్గర బేరమాడుతోందట.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ సినిమా కోసం ఈమె ఏకంగా 20 నుంచి 25కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. మ‌రి నాగ్ అశ్విన్ ముంద‌డుగు వేసి ఆమెనే ఎంచుకుంటారా.. లేదా వేరే హీరోయిన్ తీసుకుంటారా అన్న‌ది చూడాలి. కాగా, ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్ల‌నుంది. దాదాపు రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివరిలో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news