వాలంటీర్లపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ‘కోడ్ ఉల్లంఘనపై మేం ఫిర్యాదు చేస్తే ఈసీ ఒక్క నోటీసు కూడా ఇవ్వదు అని అదే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తే వెంటనే నోటీసులు ఇస్తోంది అని విమర్శించారు. ఈసీకి ఎందుకింత పక్షపాత ధోరణి? నారా భువనేశ్వరి ప్రలోభాలకు పాల్పడితే ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.ఎన్ని కుట్రలు చేసినా పేదవాడి గుండెల్లో ఉన్న సీఎం జగనన్ను ఏమీ చేయలేరు. కూటమికి ఓటమి తప్పదు’ అని అన్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘వైసీపీపై వ్యతిరేకత ఉంటే పవన్ మళ్లీ భీమవరం, గాజువాకలో ఎందుకు పోటీ చేయడం లేదు? ఇప్పుడు పిఠాపురంలో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు అని అన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబువి నీచ రాజకీయాలు అని ఆరోపించారు . వాలంటీర్లపై ఆయన కక్ష పెంచుకున్నారు. కక్షతోనే పెన్షన్లు అడ్డుకోవాలని చూశారు.’ అని ఆయన మండిపడ్డారు.