మూసీ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.. బిజేపీ కూడా మూసీ బాధితులకు అండగా నిలబడుతోంది.. దీంతో డ్యామేజ్ అవుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.. మూసీ ప్రక్షాళన విషయంలో రైతులను లాగిన సీఎం రేవంత్ రెడ్డి.. వారి ద్వారా ప్రతిపక్షాలపై విమర్శలు చేయించాలని చూస్తున్నారు..
మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్ది అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.. నల్గొండ జిల్లా దాకా విస్తరించాలని ఆయన భావించారు.. అయితే ఆయకు మూసీ పరివాహక ఎమ్మెల్యేల మద్దతు కరువైనట్లు ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కూడా ఆశించిన స్పందన రాకపోవడంతో.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట..
ఈ నెల 8న వలిగొండ మండలం సంగెంలో పర్యటించబోతున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ రైతులతో పలు అంశాలపై చర్చించబోతున్నారు..అనంతరం మూసీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళనకు మద్దతుగా ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని రైతులతో మాట్లాడబోతున్నారు. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం చాలా స్పీడ్ గా ముందుకెళ్తోందన్న విషయాన్ని నేరుగా రైతులకు వివరించబోతున్నారు..
ఇప్పటికే మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ పనులకు బీఆర్ఎస్ అడ్డు పడుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అనంత గిరి కొండల నుంచి మొదలు నల్గొండ సూర్యాపేట వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న మూసీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంది.. ఈ ప్రభావం నల్గొండ జిల్లా రైతులపై ప్రభావం పడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది..
ఈ నేపథ్యంలోనే మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతోంది. ఈ కార్యక్రమానికి రైతుల మద్దతు కూడగట్టుకునేందుకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డే రంగంలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.. ఈ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రైతులతో కలిసి సీఎం నడవబోతున్నారు. రైతులతో మాట్లాడబోతున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని.. మరింత వేగంగా మూసీ ప్రక్షాళన చెయ్యొచ్చని సీఎం భావిస్తున్నారట.. దీనిపై ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయో చూడాలి..