నా భార్య కూడా నాకు ఇన్ని లవ్​ లెటర్స్ పంపలేదు.. ఎల్​జీకి కేజ్రీవాల్ కౌంటర్

-

దిల్లీలో ముఖ్యమంత్రి వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా దిల్లీ ఎల్​జీ వికే సక్సేనాకి  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. ఎల్​జీ సాబ్ కాస్త చిల్ అవ్వండి.. మీ పైన ఉన్న మీ సూపర్ బాస్ ని కూడా కాస్త చిల్ అవ్వమనండి అని ట్విటర్ వేదికగా సెటైర్ వేశారు. అంతటితో ఆగకుండా.. ‘ఎల్​జీ గారూ మీరు తిట్టినట్టు నా భార్య కూడా రోజూ తిట్టదు. గడిచిన ఆరు నెల్లలో ఎల్​జీ రాసినన్ని ప్రేమలేఖలు నా భార్య కూడా నాకు రాసి ఉండదు’ అంటూ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్​తో అభిప్రాయభేదాల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

మహాత్మా గాంధీ, లాల్​ బహదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాజ్​ఘాట్, విజయ్ ఘాట్​లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరు కాకపోవడంపై ఆరా తీస్తూ ఇటీవల ఎల్​జీ వికే సక్సేనా.. దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దిల్లీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లేఖలో మండిపడ్డారు.

‘గాంధీ, శాస్త్రిలకు నివాళులు అర్పించే కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్​సభ స్పీకర్ సహా ఎంతో మంది అతిథులు వచ్చారు. మీరు గానీ, మీ మంత్రులు గానీ రాజ్​ఘాట్, విజయ్​ఘాట్​కు రాలేదు. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కొద్దినిమిషాలు ఉన్నా.. ఆయన ఈ కార్యక్రమాల్లో తగిన రీతిలో భాగం కాలేకపోయారు. దిల్లీ యంత్రాంగం నుంచి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా మీరు భాగం కాకపోవడం ఆమోదయోగ్యంగా కాదు’ అంటూ వీకే సక్సేనా తన లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news