మోదీని వదిలించుకోవడానికి మంచి సమయం ఇదే: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

-

భారతదేశాన్ని ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ గత రెండు పర్యాయాలుగా పాలిస్తూ ఉంది. కానీ ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రజలు సంతృప్తిగా లేరనేది వాస్తవం. అందుకే దేశంలో వివిధ రాష్ట్రాలలో త్వరలో జరగనున్న ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నట్లు వివిధ సర్వే ల ద్వారా తెలుస్తోంది. కాగా మోదీ నాయకత్వం మరియు పాలనా గురించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. మోదీ పాలనలో దేశాన్ని అస్తవ్యస్తంగా మార్చేశారన్నారు. బీజేపీ పాలనలో ఈ పది సంవత్సరాలు దేశంలోని ప్రతి ఒక్క రంగాన్ని కూడా మోదీ అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రజల మధ్యన మత చిచ్చును రాజేసి ఆర్ధిక వ్యవస్థను కాలరాశారని విమర్శించారు కేజ్రీవాల్. బీజేపీ హయాంలో ద్రవ్యోల్భణం భారీగా పెరిగిపోయింది, అంతే కాకుండా ప్రతి ఒక్క రంగంలో నిరుద్యోగం పెరిగిందని ఫైర్ అయ్యారు కేజ్రీవాల్.

మన దేశానికి ఇన్ని రకాలుగా ఇబ్బందిగా మారిన మోదీని గద్దె దించే సమయం ఆసన్నమైందని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు కేజ్రీవాల్. దేశ ప్రజలు అంతా కలిసి కట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news