దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతంలో రెండు మూడు లక్షలు దాటిన కరోనా కేసులు నెమ్మదిగా లక్షలోపు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలు సడలిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో స్కూళ్ల తెరుచుకుంటున్నాయి.
ఇటీవల ఢిల్లీ డిజాస్టర్ మెనేజ్మెంట్ అథారిటీ నిర్ణయం మేరకు ఢిల్లీలో కరోనా ఆంక్షలను ఎత్తేసింది. స్కూళ్ల ప్రారంభానికి అనుమతి ఇవ్వడంతో పాటు వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి పలికింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలో స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. 9,10 తరగతులకు నేటి నుంచి తరగతులు ప్రారంభం అయ్యాయి. దీంతో విద్యార్థులంతా బడిబాట పట్టారు. ఈనెల 14 నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు తరగతులు ప్రారంభం కానున్నాయి. దాదపు నెలన్నర నుంచి స్కూళ్లు మూతపడటంతో.. నేడు తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్వయంగా స్కూళ్లను పరిశీలించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.