ఢిల్లీ మళ్ళీ అరవింద్ కేజ్రివాల్ దే…! మెజారిటి క్రాస్…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజమే అయింది. అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 41 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉండగా బిజెపి కేవలం 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మెజారిటీకి కావాల్సింది 36 స్థానాలు మాత్రమె దానికంటే 5 స్థానాలు ఎక్కువ లీడింగ్ లో ఉంది ఆ పార్టీ.

న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ముందంజలో ఉన్నారు. అలాగే పట్పర్ గంజ్ లో ఉప ముఖ్యమంత్రి మానిష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఆల్కా లంబా కూడా ముందంజలో ఉన్నారు. 2౦15 ఎన్నికలతో పోలిస్తే బిజెపి పుంజుకుంది. అప్పుడు కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలవగా కాంగ్రెస్ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయానికి కేజ్రివాల్ దగ్గరలో ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది. గత అయిదేళ్ళుగా అరవింద్ కేజ్రివాల్ తాను చేపట్టిన కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. బిజెపి ఎన్ని వ్యూహాలు రచించినా సరే, ఆప్ అభివృద్ధి ముందు తెలిపోయాయాయి. ముందు నుంచి బిజెపి ఢిల్లీలో గెలుస్తుంది అంటూ ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నేతలకు ఈ ఫలితాలు షాక్ ఇస్తున్నాయి.