గత కొన్ని రోజుల నుండి కేంద్ర ప్రభుత్వానికి మరియు ఢిల్లీ ప్రభుత్వానికి మధ్యన ఒక విషయంపై వార్ జరుగుతోంది. సుప్రీమ్ కోర్ట్ తో సహా ఢిల్లీ లోని ప్రభుత్వ అధికారుల బదిలీ మరియు పాలన వ్యవహారాలు అన్నీ కూడా ఢిల్లీ ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని చెప్పినా ? కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించకుండా దీనిపై ఆర్డినెన్సు ను తీసుకువచ్చింది. కాగా ఈ ఆర్డినెన్సు పై కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేకుల నుండి మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు,. అందులో భాగంగా గత నెలలో పాట్నాలో జరిగిన విపక్షాల భేటీలో కాంగ్రెస్ నేతలు ఈ ఆర్డినెన్సు కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపారట.
ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ తెలియచేస్తూ.. కాంగ్రెస్ మద్దతు కోసం మేము ఎదురుచూస్తున్నామని తెలిపారు. మారియో ఈ ఆర్డినెన్సు లో కేంద్రంతో జరగనున్న పోరులో సీఎం కేజ్రీవాల్ విజయం సాధిస్తారా లేదా చూడాలి.