మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఖరీదైన కార్లు, బైకులకు తోడు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉంటే ఆ కిక్కే వేరు. దీంతో వాహనదారుల అభిరుచిని రవాణా శాఖ ‘క్యాష్’ చేసుకుంటోంది. తాజాగా ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖకు భారీ ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఒక్క రోజే రూ.53,34,894ల ఆదాయం వచ్చింది. వేలంలో అత్యధికంగా TS 09 GC 9999 నంబరు రూ.21,60,000లు పలికింది. అత్యల్పంగా TS 09 GD 0027 నంబర్‌ను రూ. 1,04,999కి కొనుగోలు చేశారు.
ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసింది ఈ సంస్థలే..
టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు(ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్), టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 లక్షలు(మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్), టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 లక్షలు(ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్), టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 లక్షలు(గోయజ్ జ్యువెలరీ), టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు(సితారా ఎంటర్టైన్మెంట్స్), టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు(సాయి పృథ్వీ ఎంటర్ప్రైజెస్), టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు(ఫైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు(శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్)