మూడు జ్యుట్ కంపెనీల ఏర్పాటు పై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందము కుదుర్చుకుంది. ఈ సందర్భంగా.. , తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు జ్యుట్ మిల్లులు లేవనీ.. 887 కోట్ల పెట్టుబడుల తో మూడు జ్యుట్ మిల్లుల ఏర్పాటు అవుతాయన్నారు. ఈ కంపెనీ ల ద్వారా దాదాపు గా 10 వేల మందికి ఉపాధి ఉపాధి లభిస్తుందనీ..వచ్చే 20 ఏళ్ళు ఈ జ్యుట్ మిల్లుల ఉత్పత్తిని తెలంగాణ కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
కరోనా సమయంలో ఎదురైన అనుభవాలతో తెలంగాణ లో జ్యుట్ మిల్లులు ఏర్పాటు చేయాలని అనుకున్నామన్నారు. తెలంగాణ లో వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని…వరంగల్,రాజన్న సిరిసిల్ల,కామారెడ్డి లలో జ్యుట్ మిల్లులు ఏర్పాటు అవుతాయన్నారు మంత్రి కేటీఆర్. ఇతర జిల్లాలో కూడా జ్యుట్ మిల్లులు ఏర్పాటు చేయడానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది టిఆర్ఎస్ సర్కార్ తోనే సాధ్యమన్నారు మంత్రి కేటీఆర్.