థ‌మ‌న్ దూకుడుతో టెన్ష‌న్‌లో దేవి

-

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇప్ప‌టికే నాలుగు సినిమాలు ప్ర‌ధానంగా ఖ‌ర్చీఫ్ వేసుకున్నా వీటిల్లో సూప‌ర్‌స్టార్ మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల మీదే అంద‌రి దృష్టి ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో సంక్రాంతికి బాక్సాఫీస్ ద‌గ్గర ఓ రేంజ్‌లో వార్ ఉంటుంద‌న్న‌ది తేలిపోయింది. పైగా ఇద్ద‌రు హీరోలు పోటీకి పోయి మ‌రీ త‌మ సినిమాల రిలీజ్ డేట్ల‌ను జ‌న‌వ‌రి 12 అని ఎనౌన్స్ చేసుకున్నారు. వీరిలో ఎవ‌రో ఒక‌రు ముందుకు.. వెన‌క్కు వెళ్లినా పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ రెండు సినిమాల మేక‌ర్స్ కూడా సంక్రాంతికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ సినిమాయే పై చేయి సాధించాల‌ని ఎవ‌రికి వారు తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌ట‌. హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు చివ‌ర‌కు టెక్నీషీయిన్లు సైతం అంతే క‌సితో ప‌ని చేస్తున్నారు. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్ల విష‌యంలో మాత్రం అల వైకుంఠ‌పురంలో సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ దూకుడుగా ఉంటూ సినిమాకు ఇప్ప‌టికే హైప్ తెస్తే… అటు స‌రిలేరు నీకెవ్వ‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ట్యూన్ కూడా వ‌ద‌ల్లేదు.

అల వైకుంఠ‌పురంలోని సామజవరగమనా పాట అత్యధికమంది లైక్ కొట్టిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా వ‌చ్చిన రెండు పాట‌లు కూడా సినిమాపై ఎక్క‌డా లేని హైప్ పెంచేశాయి. మ‌రోవైపు సరిలేరు అభిమానుల‌తో పాటు మ‌హేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా నుంచి ఒక్క సాంగ్ అయినా బ‌య‌ట‌కు వ‌ద‌లాల‌ని చెపుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సాంగ్ వ‌దిలినా అల వైకుంఠ‌పురంలో సాంగ్స్‌లో స‌గం అంచ‌నాలు అందుకోలేక‌పోతే దేవి డైల‌మాలో ప‌డిపోవ‌డం ఖాయం.

అందుకే ఇప్పుడు స‌ర‌లేరు టీం కూడా దేవీపై బాగా ప్రెజ‌ర్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటు దేవి కూడా ఈ విష‌యంలో టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టే తెలుస్తోంది. మరి ఇప్పుడు స‌రిలేరు సాంగ్స్ అల వైకుంఠపురములో సాంగ్స్‌కు వ‌చ్చిన క్రేజ్‌ను మించిన క్రేజ్‌తో పాటు సినిమాకు ఎంత వ‌ర‌కు హైప్ తెస్తాడో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news