తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం.. శ్రీవారి మెట్టు మార్గం నుంచి భక్తులకు అనుమతిని ఇవ్వనున్నారు. మే ఐదో తేదీన శ్రీనివాస సేతును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సర్వ దర్శనాలు అలాగే స్లాట్ దర్శనాలను కొనసాగించనున్నారు.
మరోవైపు శ్రీనివాస సేతు రెండో దశ పనులకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ఏర్పాటుకు దాదాపు మూడు ఎకరాల భూమిని కేటాయించినట్లు టిటీడి ప్రకటన చేసింది. వ్యవహారాల నుంచి.. బయోగ్యాస్ ఉత్పత్తి కి ప్లాంట్ ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిసెంబర్ లోపు జమ్మూ లో శ్రీవారి ఆలయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక 240 కోట్ల రూపాయలతో పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు.