భక్తి: వేప చెట్టుని, రావి చెట్టుని పూజించడం వలన కలిగే లాభాలు..!

-

వేప చెట్టుని, రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదిని అని అంటూ ఉంటారు. అయితే నిజంగా వాటిని పూజించడం వలన అసలు ఏం జరుగుతుంది..? , నిజంగా వీటి వలన మనకి ఏం లాభాలు కలుగుతాయి…? ఇలా అనేక విషయాలు మీకోసం. రావి చెట్టు ప్రకృతి లోని పావన వృక్షాలలో ఒకటి. పురాణాల్లో ఈ మహా వృక్షం గురించి ప్రస్తావన వచ్చింది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు.

రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ ఈ వృక్షాన్ని ఆశ్రయించడం వల్ల అభీష్టసిద్ది కలగడమే కాదు పాప నాశనమవుతుంది. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది ఇలా ఉండగా రావి చెట్టుని అశ్వత్థ వృక్షం, బోధి వృక్షం అని కూడా అంటారు. సిద్ధార్థుడికి జ్ఙానోద‌యమై బుద్ధుడిగా మారాడు. అందుకే దీనిని బోధివృక్షం అంటారు.

రావి చెట్టు విష్ణు స్వరూపం, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు. అలానే ఈ వృక్షాలని పూజించడం వలన దాంపత్య దోషాలు తొలగిపోతాయి. భార్య భర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు. ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రోజూ రావి చెట్టు నీడన నిలబడితే శని దోషం తొలగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news