బెదిరింపుల కేసులో వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

Join Our Community
follow manalokam on social media

విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే యూ.వి.రమణమూర్తి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.  పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారు. ఆడియో రికార్డులు, బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే లాలంకోడూరులో వైసీపీ రెబల్ అభ్యర్థి సత్యం పోటీకి దిగారు.

ఏకగ్రీవం అనుకున్న చోట పోటీ కనిపించడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. అభ్యర్థి బంధువును ఫోన్ లో హెచ్చరించారు కన్నబాబురాజు. తమ దారికి రాకపోతే అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పప్రచారం జరిగింది. అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే పై కేసు నమోదైంది. పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టగా విచారణ అనంతరం ఎమ్మెల్యేకు బెయిల్ లభించింది. ఇక ఇలాంటి కేసులో A3 ముద్దాయిగా అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు మాత్రం 14 రోజుల రిమాండ్ లో ఉండడం గమనార్హం.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...