ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ వైసీపీతో సహా మిగిలిన రాజకీయ పార్టీలను ట్యాగ్ చేశారు వాసిరెడ్డి పద్మ. ” ఐటమ్” వంటి పదాలకు జైలు శిక్షలు పడుతున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని అన్నారు.
సోషల్ మీడియాలో నీచాతి నీచంగా పోస్టులు పెట్టే వారిపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. స్పెషల్ టీంలతో సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని డీజీపీని కోరారు వాసిరెడ్డిి పద్మ.
మహిళల పట్ల నీచాతినీచంగా పోస్టులు పెట్టే వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని.. స్పెషల్ టీమ్ లతో సోషల్ మీడియాను కట్టడి చేయాలని 'మహిళా కమిషన్' ఈరోజు డీజీపీను కోరింది.@YSRCParty @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @INC_Andhra @dgpapofficial
— Vasireddy Padma (@padma_vasireddy) October 29, 2022