ఒక్కోసారి అపరిచితుల మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనకి ఏం చేయాలో తోచదు. కానీ నిజానికి ప్రేమ ఎప్పుడు పుడుతుంది ఎవరి మీద పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు. అపరిచితులతో ప్రేమలో పడినప్పుడు ఖచ్చితంగా వీటిని గమనించాలి. ఒక్కొక్కసారి మనం వాళ్ళు చెప్పేది విని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాము కానీ అపరిచితులతో ప్రేమలో పడినప్పుడు ఖచ్చితంగా వీటిని చూసుకోవాలి మాయలో పడిపోయి జీవితాన్ని అనవసరంగా రిస్క్ లో పెట్టుకోకూడదు.
అట్రాక్షన్ ఆ ప్రేమా అనేది తెలుసుకోండి:
మొదట మీరు ప్రేమలో పడినప్పుడు దీనిని మీరు కన్ఫర్మ్ చేసుకోండి అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి.
సమయం తీసుకోండి:
ప్రేమ అనేది కొన్ని సెకండ్లలో పుట్టదు ఒకవేళ కలిగినా దానిని వెంటనే మీరు చెప్పేయకండి. మీరు దాని కోసం ఆలోచించి సమయం తీసుకుని అతనితో కానీ ఆమెతో కానీ మీరు జీవితాంతం ఆనందంగా ఉంటారా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఆ తర్వాత మాత్రమే మీ ప్రేమని చెప్పండి లేదంటే అనవసరంగా మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది మీ వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడొచ్చు.
మీ ప్రవర్తన సరిగా ఉండేలా చూసుకోండి:
ఇతరుల ప్రేమను మీరు పొందాలంటే మీరు మీలానే ఉండాలి మీ ప్రవర్తన మీలానే ఉండాలి. అందులో మార్పు ఉండకూడదు ఒకవేళ కనుక మీ ప్రవర్తనలో మార్పు లేదంటే అది నిజమైన ప్రేమ అని తెలుసుకోవచ్చు. మారింది అంటే అది నిజమైన ప్రేమ కాదు.
రహస్యాలు వుండవు:
నిజంగా మీరు ప్రేమలో పడే వ్యక్తికి మీకు మధ్య రహస్యాలు ఉండకూడదు.
ఫోకస్ పడనివ్వండి:
ఒకవేళ కనుక మీరు ఎదుట వాళ్ళని ప్రేమలో పడేయాలంటే వాళ్ళ ఫోకస్ మారేటట్టు చూసుకోండి అలానే ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా మీరు వినాలి.
క్వాలిటీ టైం ని స్పెండ్ చేసి అప్పుడు మాత్రమే ప్రేమ మీద క్లారిటీ తెచ్చుకోండి.