రజనీ అల్లుడు క్రేజ్ మాములుగా లేదుగా !

-

రజనీకాంత్‌ ఇండియాకే పరిమితమైతే.. ఆయన అల్లుడు ధనుష్‌ కీర్తి మాత్రం హాలీవుడ్‌ దాకా పాకింది. ఏడాది తిరగకుండా.. రెండు ఇంగ్లీష్‌ సినిమాలు చేసే అరుదైన ఛాన్స్‌ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. క్రేజీ డైరెక్టర్స్‌.. హీరోలతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది.

హాలీవుడ్‌లో రస్సోబ్రదర్స్‌కు వున్న పేరు అంతా ఇంతా కాదు.. ఎవెంజర్స్‌తో సూపర్‌ పాపులారిటీ సంపాదించిన ఈ రస్సో బ్రదర్స్‌ ‘ది గ్రే మ్యాన్‌’ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. మూవీలో నటిస్తున్న నటీనటుల పేర్లను విడుదల చేశారు. హాలీవుడ్‌ హీరోలు గోస్లింగ్‌.. ఎవాన్స్‌తోపాటు.. ధనుష్‌ పేరు కూడా ఎనౌన్స్‌ చేశారు.

హాలీవుడ్‌ మూవీలో ధనుష్‌ నటించడం ఇది రెండోసారి. తొలి ఇంగ్లీష్‌ మూవీ ‘ ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ 2019లో విడుదలకాగా.. నిరాశనే మిగిల్చింది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే 4 మిలియన్‌ కూడా కలెక్ట్‌ చేయలేకపోయింది. మరి రెండో ప్రయత్నంలో క్రేజీ డైరెక్టర్స్‌ను ఎంచుకుని భారీగా వస్తున్నాడు ధనుష్ .

ఇండియాలో చాలామంది హీరోలు వున్నా.. హాలీవుడ్‌ మాత్రం ధనుష్‌ వైపే చూస్తోంది. ఆయన చేసిన డిఫరెంట్ రోల్సే ఈ అవకాశాలు వచ్చేలా చేసింది. మూసలో వెళ్లకుండా.. సినిమా సినిమాకూ కొత్తదనం వెతుక్కునే ఈ అరవ హీరో తన రేంజ్‌ను హాలీవుడ్‌ వరకు పెంచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news