డిసెంబర్‌ 19 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్గశిరమాసం- డిసెంబర్‌- 19- శనివారం.

మేషరాశి:ఈరాశి వారికి అనుకూలంగా ఉంటుంది !

ఈరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. ఆర్థికప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని ప్రయాణాలు. వైవాహిక జీవితం సాఫీగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీరమణ ఆరాధన చేయండి.

 

todays horoscope

వృషభరాశి:కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది !

ఈరోజు మిశ్రమంగా పనులు ఉంటాయి. ఈరోజు ధనాన్ని పొదుపు చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

మిథునరాశి:సంతోషంగా ఉంటారు !

ఈరాశి వారికి ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో మార్పు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు చేసే పనితో సంతోషం లభిస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీరామజయరామ జయరామ అనే స్తోత్రం పారాయణం చేయండి.

 

కర్కాటకరాశి:అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అనుకోని పెద్దస్థాయి వ్యక్తులను కలుస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. కానీ ఈరోజు మీరు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేసే అవకాశం. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీరామనామాన్ని జపించండి. అనుకూల ఫలితాలను పొందండి.

 

సింహరాశి:కొన్ని సమస్యలు ఉంటాయి !

ఈరాశివారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో అనుకోని సమస్యలు రావచ్చు. తోటి ఉద్యోగులతో సమస్యలు రావచ్చు. ఇంట్లో కూడా అశాంతి వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చివరకు మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా, అండగా నిలబడతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీకృష్ణాష్టకం చదవండి. స్వామికి తీపి నైవేద్యం సమర్పించండి.

 

కన్యరాశి:మీ పని సకాలంలో పూర్తవుతుంది !

ఈరోజు ఈరాశివారికి సానుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో మీరు శ్రమిస్తారు. మీ తెలివితేటలను ఉపయోగిస్తారు. మీ పనిలో ఉన్న అడ్డంకిని అధిగమించవచ్చు. మీ పని సకాలంలో పూర్తవుతుంది. ఈరోజు మీరు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల సలహాలతో పనులు చేయండి. వైవాహికంగా సంతోషం ఉంటుంది.

 

తులరాశి:ఈరోజు పనులలో ఆటంకాలు వస్తాయి !

ఈరాశివారికి మిశ్రమంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న పనిలో కొన్ని అడ్డంకులు ఉండే అవకాశముంది. కానీ మీరు పట్టుదలతో వాటిని అధిగమించే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు చేసి విజయం పొందుతారు. వైవాహికంగా బాగుటుంది.

 

వృశ్చికరాశి:కొత్త పనులను ప్రారంభించంకండి !

ఈరాశిశారికి అనుకూల, ప్రతికూల మిశ్రమాల సమాహారంగా ఉంటుంది. ఈరోజు కొత్త పనులను ప్రారంభించంకండి. ఆర్థిక విషయాలలో అనేక ఇబ్బందులు. అనవసర ఖర్చులు పెట్టకండి. ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహికంగా మాత్రం సంతోషం ఉంటుంది.

పరిహారాలుః నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి.

 

ధనస్సురాశి:ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది !

ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. గ్రహచలనాల రీత్యా అంత అనుకూలం కాదు. మీరు శ్రమించినా ఫలితం దక్కదు. కానీ తప్పనిసరిగా మీ కర్తవ్యం మాత్రం చేయాలి. భగవంతుడి సహాయంతో కొన్ని విషయాలలో మీరు ఊరట పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఎవరికి అప్పు ఇవ్వకండి. తీసుకోకండి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

మకరరాశి:కార్యాలయాలలో ప్రశంసలు వస్తాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులను పూర్తిచేస్తారు. కార్యాలయాలలో ప్రశంసలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆర్థిక లభ్ది పొందుతారు. స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో మాత్రం మొఖమాటం పడవద్దు. లేకుంటే  నష్టాలు తప్పవు. ఆరోగ్యం బాగుండదు. పిల్లలతో ఇబ్బందులు. ప్రయాణాలు వద్దు. వైవాహి జీవితంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి.

పరిహారాలుః శ్రీహనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

 

కుంభరాశి:ఈరోజు వ్యాపారులకు నష్టాలు !

ఈరోజు గ్రహచలనాల రీత్యా అనుకూలత తక్కువగా ఉంది. ఆఫీస్‌లో ఎవరితో వాదనలకు దిగకండి. ఆరోగ్యం జాగ్రత్త.వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం. ఈ రోజు మీరు ఎక్కువ కష్టపడాలి. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు వైవాహికంగా సంతోషం ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు మాటలతో ఇబ్బందులు రావచ్చు.

పరిహారాలుః ఆంజనేయ దండకం పారాయణం చేయండి.

 

మీనరాశి:ఈ రోజు మీకు ఆనందంగా ఉంటుంది !

 

ఈరోజు మంచిగా ఉంటుది. అనుకోని ఆర్థిక మార్గాలు మీ ముందుకు వస్తాయి. ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు మీకు ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వైవాహికంగా బాగుంటుంది.పిల్లల ద్వారా సంతోషం ఉంటుంది.

పరిహారాలుః శ్రీగణేష స్తోత్రం పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news