డజన్ సినిమాలలో నటిస్తూ, తగ్గేదే లేదంటున్న ధనుష్.

-

పాన్ ఇండియా తమిళ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధనుష్ డజను సినిమాలలో నటిస్తూ తగ్గేదే లేదంటున్నాడు. తమిళ్ ,హిందీ, తెలుగు తో కలిపి డజన్ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ రాయన్ కోసం సిద్ధమవుతున్నాడు. ధనుష్ కి ఇది 50వ సినిమా కాగా ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.

ధనుష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియ చిత్రంగా రూపొందుతున్న మరో సినిమా కుబేర. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ధనుష్‌ కాంబినేషన్‌లోసంగీతవిద్వాంసుడు ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇళయరాజా. ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించనున్నాడు.కోలీవుడ్‌తో పాటు ధనుష్ చేతిలో ఓ హిందీ సినిమా కూడా ఉంది.అది తేరే ఇష్క్ మెయిన్ చిత్రానికి రంజానా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా, ఇది రంజాన్ రెండో భాగం అని అంటున్నారు.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా,మరి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయినట్లు ధనుష్ వెల్లడించారు.ధనుష్ హీరోగా నటిస్తున్న వరుస సినిమాలతో పాటు.. ధనుష్ కోసం ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news