ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో ఈడీ వేగాన్ని పెంచింది. ఈ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావడానికి తనకు అభ్యంతరం లేదని, ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించినా కేజీవాల్ కి ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో కార్యకర్తలు ఆయన నివాసానికి వస్తుండడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు ఓ ఫైల్ పట్టుకుని రావడంతో అది అరెస్ట్ వారెంటేనని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీఎంను ప్రశ్నించేందుకు 12 మంది ఈడీ అధికారులు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. ఈ మేరకు కేజీవాల్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news