ఎట్టకేలకు నేటి నుండి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ లో మొదలు కానున్నాయి. హైదరాబాద్ మినహా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈమేరకు ఏర్పాట్లు చేశారు. మీ సేవలో దీనికి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఒకరకంగా దీని కోసం తెలంగాణా వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ ఆపేశారు. అలా ఆపేసిన రిజిస్ట్రేషన్లు మళ్లీ ఈరోజు ప్రారంభం అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే ప్రారంభం కానున్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు మరికొన్నిరోజుల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 20 మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు అందుబాటులోకి రానున్నాయి. పది పత్రాలలోపు ప్రక్రియతో పాటు స్లాట్ కు రూ 200 కనీస రుసుముగా నిర్ణయించింది. పది పత్రాల తర్వాత ప్రతి పత్రానికి రూ.5 చెల్లించాలని సూచించింది.