చంద్రబాబు దొంగ కంపెనీ పెట్టి దోచుకున్నాడు : మంత్రి ధర్మాన

-

టీడీపీ అధినేత స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబుకు మద్దుతుగా టీడీపీ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చదువు కోసం స్కిల్ పేరుతో రూ.356 కోట్లు నిధులు మంజూరైతే.. చంద్రబాబు కొన్ని షెల్ కంపెనీ పేరుతో దోచుకున్నాడని దుయ్యబట్టారు. దోచుకున్నదంతా దోచుకుని దబాయిస్తున్నాడని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు దొంగ తనంగా దోచుకున్నారని మండిపడ్డారు.

Dharmana Prasada Rao flays Maha Padayatra, says all regions should be  developed

2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలతో వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టిందని చెప్పారు. మరోవైపు జర్మనీకి చెందిన కొన్ని కంపెనీల పేరుతో చంద్రబాబు దొంగ కంపెనీ పెట్టి దోచుకున్నాడని మంత్రి ధర్మాన ఆరోపించారు. దొంగ కంపెనీ పేరుతో ఆరు కంపెనీలు వెలిసాయని.. ఆ ఆరు కంపెనీల పేరుతో చంద్రబాబు పీఏ కొంత డబ్బు, కొడుకు పీఏ అకౌంట్ వద్దకు కొంత డబ్బు వెళ్లిందని తెలిపారు. ఇప్పుడు వారిద్దరు పరారీలో ఉన్నారన్నారు. అయితే వారిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఎంత మంది చేతులు మారాయి అన్నది కేంద్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుందని.. అనేక పెద్ద నాయకులు కూడా జైల్ లో ఉన్నారని తెలిపారు. రూ.350 కోట్ల ప్రజల డబ్బును తినేసి.. నువ్వు, నీ కొడుకు పీఏ అకౌంట్ లో వేసుకుంటారా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంపై న్యాయం ఎవరిది అన్నది కోర్టు చెబుతుందని మంత్రి ధర్మాన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news