రెవిన్యూ శాఖను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనాలి – మంత్రి ధర్మాన ప్రసాదరావు

-

రెవిన్యూ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ లక్ష్యాలు నెరవేరుస్తామని.. రెవిన్యూ అని కాకుండా , ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బావుండేదన్నారు. సీనియర్ అధికారులతో కలిసి ఒక టీంగా పని చేయడం నా అలవాటు అని.. అనేక చట్టాల వల్ల చాలా భూములు వివాదాల్లో చిక్కుకుంటాయని పేర్కొన్నారు.

దీని వల్ల ప్రభుత్వానికి.. ఆయా వ్యక్తులకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయని.. దీన్ని దృష్టిలో పెట్టుకునే భూములను ఫ్రీ హోల్డులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు సర్వే చేస్తున్నామని వెల్లడించారు.

ఈ ప్రక్రియ వల్ల పెద్ద ఎత్తున నిధులు మార్కెట్లోకి వస్తాయని.. చాలా అంశాలు ఛాలేంజీగా తీసుకొని ముందుకెళ్తామని చెప్పారు. భూ సమగ్ర సర్వే పూర్తైతే.. జీడీపీ పెరిగి.. మరిన్ని నిధులు వస్తాయని.. భూ యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. పేదలకిచ్చిన పట్టాలను తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ వర్గాలకు లబ్ది చేకూరుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news