రేవంత్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఓ సెప్టిక్ ట్యాంక్ !

రేవంత్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నిజామాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ లాంటి సెప్టిక్ ట్యాంక్ లకు తాను దూరంగా ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరని.. డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Dharmapuri Arvind

రాహుల్ గాంధీ మీద రేవంత్ తన కోపం చూపించాలని.. దేశ వ్యాప్తంగా భాజపా పెరుగుతుంటే.. కాంగ్రెస్ తగ్గుతోందన్నారు. ఇందుకు భాజపాను రేవంత్ ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని.. ఒత్తిడిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు అనిపిస్తోందని చురకలు అంటించారు.

నిజామాబాద్ లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు.. పోటీ చేసిన వారికి డిపాజిట్లలో సగం ఓట్లు కూడా రావన్నారు. భాజపాలో జాతీయ అధ్యక్షుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ సమానమేనని తెలిపారు. తన సోదరుడు డి.సంజయ్ పై అర్వింద్ కూడా స్పందించారు. డి.సంజయ్ తో నాకు చిన్నప్పటి నుంచే ఎలాంటి సంబంధం లేదు.. ఇక ముందూ ఉండదన్నారు. సంజయ్ లోక్ సభ అభ్యర్థి అయినప్పుడు ఆలోచిద్దామని.. ధర్మపురి అర్వింద్ వివరించారు.