కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్.. మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేవలం 200 కోట్లు మాత్రమే ఇచ్చింది అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారని… కానీ అదంతా అవాస్తవం అంటూ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కరోనా వైరస్ పోరాటంలో భాగంగా ఏడు వేల కోట్లు కేటాయించింది అంటూ తెలిపారు ధర్మపురి అరవింద్. కేటీఆర్ అబద్ధపు మాటలతో రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదోవ పట్టిస్తున్నారని… లేని మాటలు ఉన్నట్లుగా ఉన్న మాటలు లేనట్లుగా అబద్ధపు మాటలు చెప్పడం లో మంత్రి కేటీఆర్ ఏకంగా తండ్రి కేసిఆర్ ని మించిపోయారు అంటూ ధర్మపురి అరవింద్ విమర్శలు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ చిల్లర రాజకీయాల మానుకుంటే బాగుంటుంది అంటూ విమర్శించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్.