బాబుకు బీజేపీ ప్లస్…జగన్‌కు మైనస్… !

-

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏదొరకంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తున్నారు. ఏ పథకం అమలు చేసినా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీడీపీకి తోడు మిగతా ప్రతిపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడాయి. కానీ ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా జగన్ ప్రభుత్వంపై పెద్ద నెగిటివ్ రాలేదు. ఏ విషయంలోనూ ప్రభుత్వానికి మైనస్ అవ్వలేదు.

అయితే ఇటీవల జరుగుతున్న హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో మాత్రం ప్రభుత్వానికి కాస్త డ్యామేజ్ జరిగేలా కనిపిస్తోంది. ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో తెలియదు గానీ గత కొంతకాలం నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులపై ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. కేవలం టీడీపీ ఒక్కటే విమర్శలు చేస్తే జగన్ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు గానీ, ఇందులో బీజేపీ కూడా తోడు అవ్వడం, వారు ఎక్కడికక్కడ ఆందోళనలు చేయడం వల్ల వైసీపీ ప్రభుత్వంపై నెగిటివ్ మొదలైనట్లు కనిపిస్తోంది.

అధికార వైసీపీ నేతలు కూడా ప్రతిపక్షాలు చేసే విమర్శలని తిప్పిగొడుతున్నారు గానీ, అది మరి సమర్ధవంతంగా చేయలేకపోతున్నారనే వాదన వినబడుతోంది. ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు బాగా కీలకమైపోయాయి. దేవాలయాలపై దాడులు జరిగితే వచ్చే నష్టం ఏమి లేదన్నట్లు కొడాలి మాట్లాడటంతో సీన్ మొత్తం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు ఆలయాలపై దాడులు ఎవరు చేస్తారనే దానిపై పెద్ద క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజలు ప్రభుత్వాన్ని పెద్ద తప్పుబట్టలేదు.

కానీ ఎప్పుడైతే కొడాలి ఈ తరహా వ్యాఖ్యలు చేశారో, అప్పటి నుంచి హిందూ దేవాలయాల విషయంలో ప్రభుత్వం బాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ధోరణి కనిపిస్తోందని భావిస్తున్నారు. పైగా బీజేపీ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తుండటంతో, ఈ హిందూ రాజకీయం జగన్ ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయ్యేలానే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news