మనుషులకే కాదు.. ఇకనుండి ఏనుగులకు కూడా.. కేంద్రం కీలక నిర్ణయం.?

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంత అనివార్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికైనా ఆధార్ కార్డు లేదు అంటే వారికి అసలు ఈ దేశంలో గుర్తింపులేదు అని అర్థం. ఒకే కార్డు ఒకే దేశం అనే నినాదంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశ ప్రజలందరికీ ఆధార్ కార్డును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆధార్ కార్డు లేనిదే ప్రస్తుతం మనిషి ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు కూడా.

అయితే ఈ మధ్య కాలంలో కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా ఆధార్ కార్డు తీసుకువచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే మనుషుల ఆధీనంలో వున్న ఏనుగులకు ఆధార్ కార్డు తరహా ప్రత్యేక సంఖ్యను కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 2,700 కు పైగా ఏనుగులు వ్యక్తులు ఆలయాల ఆధీనంలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇక ఈ ఏనుగు లన్నింటిని సంబంధించిన డీఎన్ఏ సేకరించి వీటికి ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేకమైన సంఖ్యను కేంద్రం కేటాయించనుంది. తద్వారా రానున్న రోజుల్లో ఈ ఏనుగులకు ఎలాంటి సమస్య తలెత్తినా వాటికి యజమానులే బాధ్యులుగా ఉంటారూ అంటూ అధికారులు తెలిపారు. ఇటీవలే కేరళలో ఏనుగు విషయంలో జరిగిన ఘటన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news