దిల్ రాజు అప్ డేట్స్ ఏంటంటే? చెర్రీ సినిమా ఎప్పుడంటే?

-

సంక్రాంతి చిత్రాల రారాజు దిల్ రాజు ఈ సారి కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. రౌడీ బోయ్స్ తో త‌న అదృష్టం ప‌రీక్షించుకోనున్నారు.గ‌త‌కొద్ది కాలంగా దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి పెద్ద‌గా సినిమాలేవీ రావ‌డం లేదు అని నిరాశ చెందే వారికి ఈ సినిమా ఆద్యంతం అల‌రిస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.ముద్దు సన్నివేశాలు ఉన్నాయ‌ని, తొలిసారి త‌న సినిమాలో వాటిని ఉంచామ‌ని కూడా చెబుతున్నారు.యూత్ ను టార్గెట్ చేసుకుని తీసిన సినిమా కావ‌డంతో ఆ త‌ర‌హా సంద‌ర్భాలు సినిమాలో ఉన్నాయ‌ని కూడా చెప్పారు. అదేవిధంగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సినిమాకో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కానుంది అని కూడా చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే….

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న కొత్త సినిమా సంగ‌తులు చెప్పారు. సంక్రాంతి కి త‌న అన్న కొడుకు ఆశిష్ ను తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు. విడుద‌ల‌కు సినిమాను సిద్ధం చేశారు. ఇది కాకుండా మ‌రో సినిమా క్రేజీ ప్రాజెక్టు ఆయ‌న చేతిలో ఉంది. అదే రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబోలో రానున్న చిత్రం. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేస్తామ‌ని చెప్పారాయ‌న.ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయ‌ని కూడా తెలిపారు. అన్నీ కుదిరితే వ‌చ్చే సంక్రాంతికి తాము ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.ఈ సినిమాతో పాటు విజ‌య్ – వంశీ పైడిప‌ల్లి సినిమా, ఎఫ్ 3 (వెంకీ, వ‌రుణ్ తేజ్) థాంక్ యూ (విక్ర‌మ్ కె కుమార్ డైరెక్ట‌ర్, హీరో నాగ‌చైత‌న్య, రాశీఖ‌న్నా) విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. ఎఫ్ 3 వేస‌వికి వినోదాల‌ను అందించ‌నుంది. థాంక్ యూ ఫిల్మ్ ప్రొగ్ర‌స్ ఏంట‌న్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news