జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ధోనీ? రిటైర్మెంట్ తర్వాత ధోనీ లక్ష్యం ఇదేనా?

635

గత కొన్ని రోజులుగా ధోనీ ఆటపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అది మొన్నటి ప్రపంచ కప్ లోనూ తేలిపోయింది. ధోనీ ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఆ విషయం ధోనీకి కూడా తెలుసు. అందుకే.. అంతర్జాతీయ క్రికెట్ కు ఇక పుల్ స్టాప్ పెట్టాలని ధోనీ భావించాడని వార్తలు వచ్చాయి. వాటిలో నిజమూ లేకపోలేదు.

భారత క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించిన వ్యక్తి ఎంఎస్ ధోనీ. ఆయన లేని భారత క్రికెట్ ను ఊహించలేం. ధోనీ.. భారత క్రికెట్ కు ఎన్నో విజయాలు అందించాడు. ప్రపంచం భారత్ ను చూసి గర్వించేలా చేశాడు. ధోనీకి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉన్నారంటే దానికి కారణం ఆయన ఆడే తీరు, ఆయన ప్రవర్తన, ఆయన గుణం.

అయితే.. గత కొన్ని రోజులుగా ధోనీ ఆటపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అది మొన్నటి ప్రపంచ కప్ లోనూ తేలిపోయింది. ధోనీ ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఆ విషయం ధోనీకి కూడా తెలుసు. అందుకే.. అంతర్జాతీయ క్రికెట్ కు ఇక పుల్ స్టాప్ పెట్టాలని ధోనీ భావించాడని వార్తలు వచ్చాయి. వాటిలో నిజమూ లేకపోలేదు.

ఎందుకంటే.. ధోనీ త్వరలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడట. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఆ ఎన్నికల్లో ధోనీ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నాడట. అంటే.. ధోనీ బీజేపీలో చేరబోతున్నాడన్నమాట. అయితే.. ఇదంతా గాసిప్పే.. ఎందుకంటే.. ధోనీ బీజేపీలో చేరుతున్నట్టుగా అటు బీజేపీ నుంచి కానీ.. ఇటు ధోనీ నుంచి కాని ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాకపోతే.. ప్రపంచకప్ లో ఓటమి తర్వాత ధోనీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనలోనూ ధోనీ ఆడే అవకాశాలు తక్కువే అంటున్నారు. అంతే కాదు.. ధోనీ త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడతారని తెలుస్తోంది.

అయితే.. ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే బీజేపీలో చేరుతాడంటూ.. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాస్వాన్ తెలపడంతో.. ధోనీ బీజేపీలో చేరికపై ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ధోనీ బీజేపీలో చేరితే ఖచ్చితంగా ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడతారని.. ధోనీ తర్వాతి లక్ష్యం కూడా రాజకీయాలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం.. నిజంగానే ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరుతారా లేదా?

READ ALSO  నిత్యా మీనన్ కు పెళ్లి.. అందుకే అలా?