బిగ్ బిగ్ బాస్ హౌస్ నుండి గంగవ్వ వెళ్ళిపోయిందా…?!

-

తెలుగులో నాలుగో సీజన్ ని మొదలు పెట్టిన బిగ్ బాస్ మొదలైన మొదటి రోజులలో రేటింగ్స్ బాగున్నాయని చెప్పిన హోస్ట్ నాగార్జున ఆ తర్వాత నుంచి ఒక్కసారి కూడా బిగ్ బాస్ షో కి రేటింగ్ బాగుందని మళ్లీ చెప్పనేలేదు. దీనికి కారణం ఒకింత ఐపీఎల్ సీజన్ మొదలవడం. మరోరకంగా చూస్తే ఇంటిలో సభ్యులు కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా సుపరిచితులు కాకపోవడమే. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ గంగవ్వ స్థానం ప్రత్యేకమైనది.

ఇకపోతే షో మొదట్లో ఆమె వేసిన పంచులు, ఆమె చేసే చిలిపి పనులను ప్రధాన ఫోకస్ చేస్తూ షో నిరసంగా సాగకుండా కనిపించేందుకు ఉపయోగపడ్డాయి. అయితే ఇది వరకు ఒకసారి తనకు ఆరోగ్యం సన్నగిల్లడంతో తాను ఇంటికి వెళ్ళిపోతాను అని చేతులెత్తి బిగ్ బాస్ ను వేడుకుంది. అయితే అందుకు బిగ్బాస్ ఏ విధంగా కూడా ఒప్పుకోలేదు. ఇంటికి పంపించకుండా ఆమెకు వైద్యం అందించి షోలో కొనసాగించేలా చేశాడు. ఇక ఆ తర్వాత గంగవ్వ షో లో తిరిగి అందరితో కలిసి మెలిసి మాట్లాడుతూ ఆనందంగా ఉండటంతో ఇప్పట్లో గంగవ్వ ఇంటి నుంచి బయటికి వెళ్ళదని అందరూ డిసైడ్ అయ్యారు.

కాకపోతే తాజా ఎపిసోడ్ లో గంగవ్వ మళ్లీ తన ఆలోచన ఇంటి వైపు మళ్ళింది. బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనంటూ బోరుమని ఏడ్చేసింది కూడా. అయితే ఈ సారి బిగ్ బాస్ మాత్రం ఇది వరకు కఠినంగా ఉండకుండా ఈసారి అవ్వ మొరను ఆలకించి ఆమెను బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి పంపించినట్లు సమాచారం అందుతోంది. ఇకపోతే అనారోగ్య కారణాల వల్లే ఆమెను షో నుండి తప్పించినట్లు అర్థమవుతోంది. ఈ వార్త నిజంగా గంగవ్వ అభిమానులకు షాక్ కలిగించే విషయమే.

ఈ దెబ్బతో గంగవ్వ ఇంటి నుంచి బయటికి వెళ్లి పోతే ఎక్కువగా బిగ్ బాస్ హౌస్ లో ఇబ్బంది పడేది మాత్రం అఖిల్. తాను బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ను తప్పించి ఇంకెవరిని నమ్మట్లేదని తాజా ఎపిసోడ్ లో గంగవ్వ తీసుకున్న నిర్ణయంతో అతడి పరిస్థితి మరింత భారం కానుంది. అయితే ఈ విషయంపై మాత్రం కొంతమంది నెటిజెన్స్ గంగవ్వ బయటికి వస్తే సానుభూతి లాంటివి చూపించకుండా ఎవరి ఆట వారు ఆడతారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే గంగవ్వ నేటితో ఇంటి నుంచి బయటికి వచ్చేస్తే అభిమానులు రేపటి నుంచి షో ఎలా చూస్తారో మరి.

చివరి వారంలో కూడా గంగవ్వ పట్ల సానుభూతి నేపథ్యంలో అప్పుడు జరిగిన ఫ్యాషన్ షోలో కూడా గంగవ్వ విన్నర్ అన్నట్లుగా ప్రైస్ మనీ కూడా ఆమెకే ఇచ్చారు. అయితే గంగవ్వ ఉన్నన్ని రోజులు కూడా ఇంట్లోనే సభ్యులు కొన్ని విషయాలలో గంగవ్వ నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. ఇకపోతే తాజాగా గంగవ్వ బయటికి వెళితే ఈ వారం నామినేషన్ లో ఎన్నుకోబడిన వారందరూ సేవ్ అయినట్లేనా అన్న క్వశ్చన్ ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులు తలెత్తుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news