వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే జగన్ ఈ ప్లాన్ వేసారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జగన్ సర్కార్ జీవో నెంబర్ 176 ని విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 176 పై ముందు నుంచి అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అసలు సుప్రీం కోర్ట్ ఎప్పుడో 2010లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వొద్దని ఆదేశాలను జారీ చేయగా,

వాటిని ఏ మాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ రిజర్వేషన్ ఇస్తూ జీవో విడుదల చేసారు. అసలు అలా ఎందుకు చేసారు ఏ మాత్రం సాధ్యం అనే అనుమానాలు ముందు నుంచి వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా ఇవ్వడానికి ప్రత్యేక పరిస్థితులు అంటూ ఏమీ లేవు. దీనితో ఏపీ రెడ్డి సంఘం నేత సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు. రాష్ట్ర హైకోర్ట్ కూడా ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు.

దీనితో సుప్రీం కోర్ట్ ఇప్పుడు ఎన్నికలకు స్టే ఇచ్చింది. అయితే రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే వ్యతిరేకత బయటపడుతుంది అని తెలుగుదేశ౦ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని జగన్ భావించారు. అందుకే ఈ తరుణంలో ఆయన ఆ విధంగా వ్యవహరించారని అంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు జరిగే సూచనలు ఏ మాత్రం లేవని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news