దుబ్బాక ఉప ఎన్నిక.. కేసిఆర్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా..?

ప్రస్తుతం తెలంగాణా లో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష అధికార పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఓటర్లందరికీ ఎన్నో హామీల వర్షం కూడా కురిపిస్తున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. ఇక ఈ దుబ్బాక ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ క్రమంలోనే ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

ఇక మరో సారి దుబ్బాక నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని టిఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది టికెట్ ఆశించి భంగపడిన ఆశావహుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి కేసీఆర్ దిగనున్నట్లు తెలుస్తోంది ఈనెల 30,31 తేదీల్లో కేసిఆర్ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడంతోపాటు అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.