ఆ హీరో వల్ల ఓ ఊరిలో ఏకంగా మర్డర్ జరిగిందట తెలుసా?

-

ప్రతి సినీ హీరో నటించిన సినిమాలు భారీ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు జనాల మనసును దోచుకున్నాయి.. ఆ సినిమాల గురించి జనాలు కథలు కథలుగా చెప్పుకుంటారు.. హీరో నాగార్జున కెరియర్ లో ఎన్నో బెస్ట్ సినిమాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సినిమాగా నిలవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమా ఏదనే ప్రశ్నకు శివ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.

ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారు. ఈ సినిమాను నిజంగా వర్మ తెరకెక్కించారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తారనే సంగతి తెలిసిందే.అయితే, శివ మూవీ వల్ల ఆత్మకూరు అనే ఊరిలో మర్డర్ జరిగిందనే సంగతి చాలామందికి తెలియదు. నిర్మాత ప్రవీణ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

వజ్రం, శివ సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదలయ్యాయని శివ సినిమా గుంటూరు సినిమా హక్కులను మేము కొనుగోలు చేశామని ఆయన కామెంట్లు చేశారు.గీతాంజలి సైలెంట్ హిట్ అని శివ మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందని ప్రవీణ్ రెడ్డి అన్నారు. శివ సినిమా వల్ల ప్రతి ఒక్కరు సైకిల్ చైన్ ను జేబులో పెట్టుకునేవారని ఆయన పేర్కొన్నారు.

ఇక పోతే ఈ సినిమా వల్ల ఆత్మకూరులో మర్డర్ జరిగిందని ఈ మూవీ వల్ల చాలా జరిగాయని ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఈ సినిమా ఆ స్థాయిలో ప్రభావం చూపించిందని ఆయన కామెంట్లు చేశారు.గీతాంజలి రీరికార్డింగ్ ఒక విధంగా సెన్సేషన్ అని ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆ సినిమా బ్యాగ్రౌండ్ కోసం అనురాధ పౌడ్వాల్ పని చేశారని ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు. గీతాంజలి ఆస్పత్రి సన్నివేశాల్లో బీజీఎం ఉండకూడదని సలహా ఇచ్చింది ఇళయరాజా అని ఆయన కామెంట్లు చేశారు..ఆ నాగ్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news