బుజ్జిగాడు సినిమాలో అన్నాచెల్లెళ్ళు లవర్స్ గా నటించారు అని మీకు తెలుసా..?

-

బిచ్చగాడు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అందులో చిన్ననాటి పాత్రలో నటించిన సన్నివేశాలు ప్రతి ఒక్కరిని గుర్తు ఉంటాయి. వారి పేర్లు ఆకాష్ , పవిత్ర. వీరిద్దరి యాక్టింగ్ బాగా అదిరిపోయింది అని చెప్పవచ్చు. చిన్నతనంలో అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టపడితే ఎలా ఉంటుంది.. గొడవ పడితే ఎలా ఉంటుంది.. అనేది బాగా చూపించారు.. డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే ఆకాష్, పవిత్ర ఇద్దరు అన్నాచెల్లెళ్లు అనే విషయం తెలిసిందే.Bujjigadu | Cinema Chaat

బుజ్జిగాడు సినిమాలో పవిత్ర నటించారు కదా స్కూల్లో ఏమన్నారు అని అడిగితే ఆ సమయంలో ఆ సన్నివేశం చూసి ఒకరు నవ్వుకున్నారు తెలిపారు ఆకాశ్. అంతకంటే ముందు ఈ సినిమాలో నటించానని చెప్పాడట. నాతో ఈ సినిమాలో పవిత్ర నటిస్తే బాగోదు అని కూడా చెప్పారు కానీ పూరి జగన్నాథ్ ఆకాశ్ మాట వినలేదని , పెద్దయ్యాక నువ్వు నీ హీరోయిన్ ని వివాహం చేసుకుంటావు రా ఇప్పుడు ఈ సినిమాలో నటించ నివ్వు అని చెప్పారట. అయితే ఇదంతా కేవలం యాక్టింగ్ మాత్రమే చేశామని చెప్పారట. అలా బుజ్జిగాడు సినిమాలో అన్నా చెల్లెలు లవర్స్ గా నటించారు.Theft in Puri Jagans residence, Puri Jagannath, house, Director

బుజ్జిగాడు సినిమా కంటే ముందుగా ఆకాశ్ చిరుత సినిమాలో చిన్ననాటి రామ్ చరణ్ గా నటించారు . ఈ సినిమా సమయంలో ఆకాశ్ ను చూసిన వాళ్ళ అమ్మ ఏడ్చేసిందట. చిరుత సినిమా సమయంలో జైల్లో ఆకాశ్ గిన్నె పట్టుకుని వెళుతూ ఉంటే అన్నాన్ని లాగడం , తినడం, కొట్టడం వంటి సన్నివేశాలు చూసి తట్టుకోలేక పోయిందట. ఆకాశ్ తల్లి లావణ్య. ఇక నేనింతే సినిమాకు కూడా ఆకాశ్ ప్రొడక్షన్ బాయ్ గా పనిచేశారు. సెట్ లో ఉన్నప్పుడు కార్వాన్ లోకి ఎవరిని రానీకుండా చూడమని చెప్పాడట పూరి జగన్నాథ్. అలా పూరి జగన్నాథ్ ఒక రోజంతా ప్రొడక్షన్ బాయ్ గా పని చేయించారట ఆకాష్ తో.

Read more RELATED
Recommended to you

Latest news