ఈ సాంకేతాలు కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తున్నట్లే తెలుసా?

-

డబ్బులు ఈరోజుల్లో ప్రతిఒక్కరికి అవసరమే.. అక్రమంగా సంపాదించినదేదీ నిలవదు. జనం మాత్రం ఇప్పుడు ఇలాగే తయారయ్యారు. ఎదుటి వాడిని ముంచైనా డబ్బు సంపాదించుకోవాలనే దురాశతో ఉన్నారు. మనకు లక్ష్మీయోగం పట్టాలే కానీ డబ్బుదేముంది. మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తే కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లే అని భావించుకోవచ్చు..ఆ సంకెతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. మనం నిద్ర లేవగానే ఇల్లు ఊడుస్తున్నట్లు కనిపిస్తే మనకు అదృష్టమే వస్తుంది. గుడ్లగూబ కనిపించినా మనకు లక్ష్మీ యోగం పట్టబోతోందని తెలుసుకోవాలి. లేస్తూనే శంకర శబ్ధం వినిపిస్తే కూడా లక్ష్మీదేవి వస్తున్నట్లు అనుకోవాలి. ఇంకా చెరకు గడ కనిపిస్తే ఇంకా మంచిది. చెరకు మన గడపలోకి వస్తే త్వరలో మన జాతకం మారబోతోందని అర్థం. ఇలా చాలా విషయాలు మనకు లక్ష్మీయోగం పడుతున్నట్లు అనుకోవాలి. లక్ష్మీదేవి అంటే ధనమే కాదు. మంచి గుణం, మంచి పేరు ఇవి కూడా లక్ష్మీయోగాలే. కానీ ఇటీవల అందరికి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బే అనే భ్రమలోనే ఉంటున్నారు జనాలు..

మన పూర్వికులు ఎప్పుడు డబ్బు మీద వ్యామొహం ఉండేది కాదు కేవలం..స్వార్థం, అసూయ వంటి వాటిని త్యజించారు. సక్రమమైన జీవన మార్గంలోనే వారు మోక్షం పొందారు. కానీ మనం అడ్డదారుల్లోనే వెళ్తున్నాం. ఎదుటి వాడికి ఏమైనా ఫర్వాలేదు మనం బాగా ఉంటే సరిపోతుంది అనే ధోరణిలో ఉంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మనలో కూడా మార్పు రావాలి. దైవ చింతన లో గడుపుతూ వేరొకరికి మంచి చేయకున్నా చాలు చెడు మాత్రం చెయ్యకూడదని గ్రహించండి..ఒకరికి మంచి చేయకున్న కూడా చెడును మాత్రం చెయ్యకండి..

Read more RELATED
Recommended to you

Latest news