ఆ హీరోయిన్ బికినీ ధర ఎంతో తెలుసా…?

85

సినిమా నటులు ఏది చేసినా ఒక ట్రెండ్ అవుతుంది. ఎన్ని విధాలుగా చూసినా సరే వాళ్ళు చేసిన ప్రతీ ఒక్కటి అందంగానే ఉంటుంది. మేకప్ ఒక ట్రెండ్ అయితే వేసుకున్న బట్టలు మరో ట్రెండ్. సాధారణంగా బికినీ అంటే ఎంత ధర ఉంటుంది…? మహా అయితే మూడు నుంచి నాలుగు వేలు. కాని ఇప్పుడు ఒక బికినీ ధర తెలిసి బాలివుడ్ జనం కూడా షాక్ అయ్యారు. ఊహించని ధర పలికింది ఆ బికినీ.

ఇప్పుడు బాలివుడ్ లో బికినీ అనేది ఒక కామన్. బాలివుడ్ లో ప్రతీ సినిమాలో ఏదోక సందర్భంలో బికినీ కనపడుతుంది. దీనిని ప్రజలు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. సాంప్రదాయాలు అదీ ఇది అని మాట్లాడే వారు బికినీ చూసి లైట్ తీసుకుంటున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో గ్లామర్ గా కనిపించాలి అంటే బికినీ తప్పనిసరి. అందుకే బికినీలు వేసుకోవడానికి ఎలాంటి షరతులు పెట్టడంలేదు హీరోయిన్లు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్ కిడ్ తార సుతారియా ఇటీవల బికినిలో ఒక ఫోటోషూట్ చేసింది. చాక్లెట్ కలర్ మోనోకినిలో మెరుపులు మెరిపించింది. సింపుల్ గా ఉన్న బికినీ ఖరీదు రూ. 25వేలు. 25 వేలరూపాయల బికినీ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాలివుడ్ లో ఇప్పటి వరకు ఇదే కాస్ట్లీ బికినీ అంటున్నారు కొందరు సిని జనం.