ప్రతి పూజకి కూడా తమలపాకు అవసరం. తమలపాకు లేక పోతే పూజ అనేది అవ్వదు తమలపాకు గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. తమలపాకులో దేవతలు ఉంటారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకే తమలపాకుని పూజించాలి. పూజించెందుకు ఉపయోగించాలి.
తమలపాకులు లో అనేక దేవత రూపాలు కొలువై ఉన్నాయని శాస్త్రం అంటోంది. మరి ఇక ఏ దేవతలు ఉన్నారు అనేది చూస్తే.. తమలపాకు చివర మహాలక్ష్మి దేవి ఉంటుంది జేష్టా దేవి తమలపాకు కాడికి కొమ్ముకి మధ్య లో ఉంటుంది. విష్ణుమూర్తి కూడా తమలపాకులు లో కొలువై ఉంటారు. ఇంద్రుడు శుక్రుడు కూడా ఉంటారు. తమలపాకు మధ్య భాగంలో అయితే సరస్వతి దేవి ఉంటుంది.
తమలపాకు కుడి వైపున భూదేవి ఉంటుంది. తమలపాకు కి ఎడం వైపు పార్వతి దేవి మాంగల్య దేవి వుంటారు. కామదేవుడు తమలపాకు పై భాగం లో ఉంటారు ఇలా వివిధ దేవత రూపాలని కలిగి తమలపాకు ఉంటుంది. తమలపాకు ఖచ్చితంగా పూజల్లో వాడాలి అలానే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు తమలపాకుతో. అందుకే ఇంత గొప్ప తమలపాకుని పూజలో కచ్చితంగా వాడుతూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో అందుకే తమలపాకు కి ఇంత ప్రాధాన్యత ఉంది.