స్టేట్ బ్యాంక్ లో ఖాతా వుందా..? అయితే మీ ఫోన్ లో ఈ యాప్స్ వుండకూడదు తెలుసా..?

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. అయితే తాజాగా మోసలబారిన పడకుండా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం కొన్ని విషయాలని చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

బ్యాంక్ అకౌంట్ వున్నవాళ్లు తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి. అయితే ఫోన్ లో ఈ యాప్స్ వుండకూడదు అని చెప్పింది. అయితే మరి స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ఖాతా లో ఏ యాప్స్ వుండకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ వున్నవాళ్లు ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్ వ్యూ వంటి యాప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనే స్మార్ట్‌ఫోన్స్‌లో ఇంస్టాల్ చేసుకోకూడదు అని బ్యాంక్ అంది.

ఇవి ఉంటే ఇబ్బంది పడాలని తెలిపింది. మోసగాళ్లు వీటి ద్వారా మోసానికి పాల్పడే అవకాశం ఉంటుంది అని చెప్పింది. అందువల్ల ఇలాంటి యాప్స్‌కు దూరంగా ఉండటం మంచిది. అలానే యూపీఐ వాడే వారు కూడా అలర్ట్‌గా ఉండాలి అని స్టేట్ బ్యాంక్ చెప్పింది. తెలియని వారి నుంచి యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే దాన్ని రిజెక్ట్ చెయ్యాలని బ్యాంక్ చెప్పింది.

అలానే తెలియని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం కూడా మంచిది కాదు. అలానే బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్ చేయవద్దు. ఇలా సెర్ట్ చేసి లభించిన నెంబర్‌కు కాల్ చేస్తే మోసపోవాల్సి వస్తుంది. కనుక స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాలని గుర్తు పెట్టుకోవాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news