టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యూత్లో క్రేజ్ హీరోగా పేరుపొందారు. మొదట పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి ,గీతగోవిందం, టాక్సీవాలా వంటి చిత్రాలతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ఈ ఏడాది పాన్ ఇండియా లేవలో వచ్చిన లైగర్ సినిమా కూడా భారీ డిజాస్టర్ ని చవి చూసింది.
హిందీలో ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాని అనౌన్స్మెంట్ చేసిన అది మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా సమంత నటిస్తోంది. సమంత అనారోగ్యం కారణం చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది. ఈ చిత్రాన్ని శివ నిర్మాణ దర్శకత్వంలో నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు.
అసలు విషయంలోకి వెళ్తే విజయ్ దేవరకొండకు యూత్లో క్రేజ్ బాగానే ఉంది. ఆ కారణం చేత తను ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసిన చాలా ట్రెండీగానే మారుతూ ఉంటుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అందులో విజయ్ ధరించిన వాచ్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇది ఒక కార్టియర్ వాచట. ఈ వాచి ధర ఏకంగా రూ.3042,935.07 లక్షల అట ఈ వాచ్ తెరిసాగానీటిజన్లో ఒకసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఒక చిత్రానికి విజయ్ దేవరకొండ 10 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్నారు.