చాలా మంది బంగారాన్ని కొనేందుకు ఇష్టపడుతూ వుంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొంటారు. అలానే సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్‌గా కూడా చాలా మంది భవిస్తూ వుంటారు. ఈ మధ్యన చాలా మంది డిజిటల్ గోల్డ్ ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. మరి దానికి సంబంధించి వివరాలను చూద్దాం. డిజిటల్ గోల్డ్‌ను ఫోన్ పే లేదా పేటీఎం వంటి వాటి ద్వారా కూడా కొనచ్చు. మరి ఇది సురక్షితమా కాదా అనేది చూద్దాం.
MMTC-Pamp, Augmont, SafeGold వంటి ప్రభుత్వ గుర్తింపు వుండే బంగారం రిఫైనర్లతో పని చేస్తాయి.
డిజిటల్ గోల్డ్ అనేది సేఫ్ ఆప్షన్ ఏ. కానీ కొంత రిస్క్, షరతులు అయితే ఉంటాయి.
డిజిటల్ గోల్డ్ కోసం 2 నుంచి 3 శాతం ఫీజు వసూలు చేస్తాయి. బ్యాంక్/క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఛార్జీలను ఇది కవర్ చేస్తుంటాయి కనుక.
పైగా ఈ గోల్డ్‌పై కూడా 3 శాతం జీఎస్టీ విధిస్తారు.
ఎంత కొనేందుకు అవుతుంది..?
రూ.1కి కూడా కొనుగోలు చేయవచ్చు.
లిమిట్ అంటూ ఏమి లేదు.
కానీ రూ.1.5- రూ.2 లక్షల కంటే ఎక్కువ కొనుగోళ్ల కోసం KYC వివరాలను ఇవ్వాల్సి వుంది.
ఫిజికల్ గోల్డ్‌గా మార్చచ్చా..?
MMTC-Pamp, Augmont, SafeGold వంటి వాటితో పనిచేసే ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డిజిటల్ గోల్డ్ కొంటే… అది వాల్ట్‌లో స్టోర్ అవుతుంది. నామమాత్రపు ఛార్జీలను చెల్లించి ఎప్పుడైనా ఫిజికల్ గోల్డ్ పొందవచ్చు.