గులాం నబీ ఆజాద్ నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడు – దిగ్విజయ్ సింగ్

-

కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ పై దిగ్విజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. గులాం నబీ ఆజాద్ నమ్మక ద్రోహి.. పదవులు అన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ ను..రాహుల్ గాంధీ ను తిడుతున్నాడని నిప్పులు చెరిగారు. మేమిద్దరమ్ 1977 నుండి కలసి కాంగ్రెస్ లో వున్నాం.. పదవులు లేకపోతే గులాం నబీ ఆజాద్ వుండడని ఆగ్రహించారు.

రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని గులాంనబీ ఆజాద్ చెప్పడమ్ సిగ్గుమాలిన పని అని.. G-23, CWC సభ్యుడిగా వున్నా గులామ్ నబీ ఆజాద్ ని రాహుల్ గాంధీ ఎప్పుడూ గౌరవించారని వెల్లడించారు. గులాం నబీ ఆజాద్ వెన్నుపోటు దారుడని మండిపడ్డారు. అటు సీఎం కేసీఆర్‌ మా కాంగ్రెస్ వ్యక్తే అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దిగ్విజయ్ సింగ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరి సీఎం లు KCR, జగన్ లపై దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణఇవ్వకుంటేఇద్దరు ఎంపీలున్న TRS తెలంగాణ తెచ్చేదా?? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో TrS విలీనం‌చేస్తా అన్నాడు..ఎక్కడ చేసాడని గుర్త చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news