రాజకీయ ఎంట్రీ పై దిల్ రాజు క్లారిటీ..!

-

కంటెంట్ ఉంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న దిల్ రాజు నమ్మకాన్ని ఇటీవల వేణు “బలగం” చిత్రం నిజం చేసింది. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పేరు సంపాదించుకున్న వేణు దర్శకుడిగా మారి.. ప్రియదర్శి హీరోగా.. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా.. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం. దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా చిన్న సినిమాగా విడుదలై ఊహించని విధంగా అతిపెద్ద విజయం సాధించింది. అంతేకాదు ఎవరు ఊహించని విధంగా అవార్డులను కూడా సొంతం చేసుకుంటోంది.

ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమా పల్లెటూర్లలో ఏకంగా తెరలు కట్టి మరీ సినిమా వేయడం.. బలగం సినిమాలకు పలు అభినందనలు, ఇంటర్నేషనల్ అవార్డులు రావడం జరగడంతో ఈ నేపథ్యంలోనే దిల్ రాజు మరొకసారి బలగం సినిమాపై ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన మాట్లాడారు. ఇకపోతే బలగం సినిమాను ఆస్కార్ కి కచ్చితంగా పంపించేలా చర్యలు తీసుకుంటాము.. ఏదో బడ్జెట్ పెట్టాలని వార్తలు వచ్చాయి.. నేను కూడా కార్తికేయతో దాని గురించి మాట్లాడాను.

అమెరికాలో సినిమా ప్రమోషన్ చేయాలి కాబట్టి దానికోసం డబ్బు పెట్టాలి.. ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ సినిమా విషయానికి వస్తే వాళ్లేమి ఎక్కువగా బడ్జెట్ పెట్టలేదు. అందుకే మేము కూడా బలగం సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము అని ఆయన తెలిపారు. ఇక రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజకీయ నాయకులు సైతం మా బలగం సినిమాను అభినందిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు , మా ఊరి నాయకులు నన్ను రాజకీయాల్లోకి రమ్మంటున్నారు. ఎవరేమన్నా నేను తట్టుకోలేను. రాజకీయాల్లో విమర్శలు చాలా ఎక్కువ.. అందుకే నాకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news