ఈ మధ్య కాలం లో చాలా మంది వాళ్ళకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీముల్లో డబ్బులని పెడితే మంచిగా లాభాలని పొందేందుకు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. రిస్క్ ఏమి ఉండదు. సూపర్ బెనిఫిట్స్ ని మనం ఈ స్కీమ్స్ తో పొందేందుకు అవుతుంది. ఈ స్కీమ్స్ ద్వారా కచ్చితమైన లాభం సొంతం చేసుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన పథకాల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి.
స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్నింటిలో కంటే ఎక్కువ వడ్డీ ని ఇస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు ని సర్కార్ ఈ మధ్యే పెంచేసింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై కూడా వడ్డీ రేటు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త వడ్డీ రేటు పెంపు అమలు లోకి వచ్చింది. ఇప్పుడు ఈ స్కీమ్ వడ్డీ రేటు 8.2 శాతం గా వుంది. ఈ స్కీము మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మెచ్యూరిటీ సమయంలో మీకు వడ్డీ, అసలు రెండు కలిపి వస్తాయి. డిపాజిట్ మొత్తం లిమిట్‌ను కూడా కేంద్రం పెంచింది. ఇప్పుడు రెట్టింపు డబ్బును దాచుకోవచ్చు. గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఇది వరకు ఇన్వెస్ట్ చేయడానికి అయ్యేది. ఇప్పుడు దీన్ని రూ. 30 లక్షలకు పెంచారు.
అంటే ఈ స్కీములో ఇప్పుడు రూ. 30 లక్షల వరకు డబ్బులు పెట్టుకోవచ్చు. ఐదేళ్ల కాలంలో 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ. 42.3 లక్షలు మీకొస్తాయి. వడ్డీ రూపంలోనే రూ. 12 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ డబ్బులు త్రైమాసికం చొప్పున ఇస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 61,500 వస్తాయి. వార్షికంగా వడ్డీ రూపంలోనే మీరు రూ. 2.46 లక్షలు ని తీసుకోవచ్చు. అదే భార్యభర్తలు ఇద్దరూ చేరితే ఇద్దరికీ రూ. 12.3 లక్షలు వస్తాయి. ఇద్దరికీ కలిపి రూ. 25 లక్షల వస్తాయి. రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ని కూడా పొందొచ్చు.