టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక డిస్ట్రిబ్యూషన్ లో నైజాం కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రొడ్యూసర్ గా చక్రం తిప్పుతున్నాడు. ఇక ఈ రోజుల్లో ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన తొలి రోజుల్లో ఎంత కష్టపడి వచ్చాడో అని అర్థమవుతుంది. మొదటి మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో సినిమాలు మానేసి.. వ్యాపారం చేసుకోవాలని భావించినా.. దిల్ రాజ్ కి మాత్రం అదృష్టం వరించిందని చెప్పవచ్చు. కేవలం చిన్న దుకాణం పెట్టుకుని హైదరాబాదులో కాలం వెళ్ళదీస్తున్న సమయంలో చిన్నాచితక డబ్బులకు కూడా రెండు డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేసినా అవి కూడా పరాజయం పాలయ్యాయి.
ఇక ఒకరోజు నటుడు అలాగే నిర్మాత అయిన కాస్ట్యూమ్ కృష్ణను కలిసాడట. ఆ సమయంలో కృష్ణ పెళ్లి పందిరి అనే సినిమాను తీస్తున్నాడు. ఇక ఈ సినిమా మాతృకను కన్నడలో దిల్ రాజు చూసి ఎంతో ముచ్చటపడి ఎలాగైనా సరే ఈ సినిమాను నైజాం ఏరియాకి డిస్ట్రిబ్యూషన్ కొనుక్కోవాలని భావించాడు.
అందుకు కృష్ణ కూడా కేవలం రూ.60 లక్షల కి ఆ సినిమా రేట్స్ ని ఆఫర్ చేశాడు. ఇక అలా రూ. 60 లక్షలు కూడా పెట్టడానికి దిల్ రాజు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.
ఆ సమయంలో అతడి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇకపోతే రూ.30 లక్షలు నాలుగు దఫాలుగా చెల్లించాలని చెప్పాడు కృష్ణ . ఇక మిగతా రూ. 30 లక్షలు సినిమా విడుదలయ్యాక ఇవ్వాలని ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇక అందుకు ఒప్పుకున్న దిల్ రాజు ఒక్కోసారి రూ.6 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉండగా రూ.10,000 , రూ.20,000 చొప్పున అందరి దగ్గర చేయి బదులు తీసుకుని మొదటి రూ. ఆరు లక్షలు జమ చేశాడు. అంతేకాదు ఈ ఆరు లక్షల కోసం 100 గుమ్మాలు తొక్కాను అంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ విషయాలన్నీ కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టే స్థాయికి ఎదిగారు అంటే ఆయన కష్టం ఎంత ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.